Nalgonda: ఎయిడ్స్ నివారణపై 100% అవగాహన కల్పించాలి: నల్లగొండ కలెక్టర్!

Nalgonda: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 3 Aug 2026 8:27 PM IST
Nalgonda
X

Nalgonda: ఎయిడ్స్ నివారణపై 100% అవగాహన కల్పించాలి: నల్లగొండ కలెక్టర్!

నల్గొండ: జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై అన్ని వర్గాల ప్రజలకు నూటికి నూరు శాతం అవగాహన కల్పించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలు, దాబాలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు మరియు కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని సూచించారు.ఈ నెల 12 నుంచి 18 వరకు కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story