Nalgonda: ప్రజాకవి కాళోజీ సాహిత్యం ఆచరణీయం: నల్లగొండ కలెక్టర్!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Nalgonda: ప్రజాకవి కాళోజీ సాహిత్యం ఆచరణీయం: నల్లగొండ కలెక్టర్!
నల్గొండ: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సాహిత్యం ఆచరణీయమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కాలోజీ నారాయణరావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలో జన్మించిన కాళోజీ నారాయణరావు వరంగల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారని, చిన్నప్పటినుండి సాహిత్యం పై పట్టు సాధించారని, విభిన్న భాషలలో ప్రావీన్యులైన కాలోజి నారాయణరావు 1941 లో తన మొదటి కవితను ప్రచురించడం జరిగిందని ,అప్పటినుండి తన తుది శ్వాస విడిచే వరకు సాహిత్యంలో ప్రత్యేకించి తెలంగాణ సాహిత్యంలో వారి ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
సమాజాన్ని ఉద్దేశించి వారు రాసిన కవితలు, తెలంగాణ ఉద్యమంలో వారు ప్రశ్నించిన కవితలు,రాష్ట్రాన్ని సాధించడానికి చాలా దోహదపడ్డాయని , ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవిస్తూ వారి గుర్తుగా హెల్త్ యూనివర్సిటీకి కాళోజి హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసిందని తెలిపారు. " మర్రి విత్తనమంత చిన్న పద్యంలో మహా వృక్షమంత అర్థం" కాళోజీ కవితల సొంతమని , అలాంటి సాహిత్యంతో వారి భావజాలం ద్వారా తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ ప్రజల అందజేశారని అన్నారు .కాళోజి నారాయణరావు సాహిత్యం ఆచరణీయమని వారి ఆశయాలతో అందరూ సన్మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
కాళోజి నారాయణరావు, దాశరథి, సుమతి, వేమన వంటి వారి కవితలు మన జీవన గమనాన్ని శాసిస్తాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్,కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాలోజి నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.




