Nalgonda: విద్యార్థుల యూనిఫాంల పంపిణీపై కలెక్టర్ చంద్రశేఖర్ నిఘా!

Nalgonda: కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యా, సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపి, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 28 July 2026 11:38 PM IST
Nalgonda
X

Nalgonda: విద్యార్థుల యూనిఫాంల పంపిణీపై కలెక్టర్ చంద్రశేఖర్ నిఘా!

నల్గొండ: విద్యార్థుల యూనిఫాంల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, క్లాత్ పంపిణీ పూర్తయిన చోట తక్షణమే యూనిఫారాలు కుట్టించి విద్యార్థులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేజీబీవీలు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్, మహాత్మా జ్యోతిబాఫూలే మరియు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన క్లాత్‌ను ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. ముఖ్యంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, నల్గొండ మండలాల్లో పూర్తిస్థాయిలో క్లాత్ అందుబాటులో ఉన్నందున, కుట్టు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story