Nalgonda: నల్లగొండలో ఘనంగా 'అగ్రి షో' ప్రదర్శన ప్రారంభం!

Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత కిసాన్ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన 'అగ్రి షో' ప్రదర్శనను కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

Saleem, Nalgonda
Published on: 14 Nov 2026 3:36 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఘనంగా 'అగ్రి షో' ప్రదర్శన ప్రారంభం!

Nalgonda: అఖిల భారత కిసాన్ సభ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 'అగ్రి షో' (Agri Show) ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు.

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను, నూతన పనిముట్లను రైతులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అనంతరం వారు స్టాళ్లను సందర్శించి, వివిధ రకాల యంత్రాలు, విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda