Nalgonda: ఉచిత పోలీసు శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ!
Nalgonda: నల్లగొండ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణా తరగతులను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
Nalgonda: ఉచిత పోలీసు శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ!
Nalgonda: పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తే ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధన సులువేనని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో (డీటీసీ) పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పోలీసు శాఖ ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అభ్యర్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా సొంతంగా చదువుకునేందుకు సమయం కేటాయించాలని సూచించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో 350 మందికి 45 రోజుల పాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
రాత పరీక్షలతో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని ఎస్పీ కోరారు. మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి మాక్ టెస్టులు, మునుపటి ప్రశ్నపత్రాలను సాధన చేయాలన్నారు. అనంతరం శిక్షణ తరగతులు, అభ్యర్థుల సదుపాయాలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీటీసీ డీఎస్పీ నగేష్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.




