Suryapet: నూతనకల్లు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
Suryapet: నూతనకల్లులో హెల్త్ సెంటర్ పనులు, భూమి రీ-సర్వేపై సమీక్షించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. భూ భారతి చట్టం ద్వారా పట్టాల పంపిణీకి ఆదేశం.
Suryapet: నూతనకల్లు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
సూర్యాపేట: నూతనకల్లు మండలంలో పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే పంపించాలని సూచించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర బయో బ్యాగుల తయారీ కేంద్రం (బయో ప్రొడక్ట్) ను సందర్శించి ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి వ్యయం, మార్కెటింగ్, విక్రయాలకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.
రీ సర్వే పనులపై సమీక్ష
నూతనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ మరియు సర్వే సిబ్బందితో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతుల భూములకు రీ సర్వే పూర్తి చేసి, భూ భారతి చట్టం 2025 ద్వారా పట్టాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నూతనకల్లు మండలంలోని 9 గ్రామాలు, మద్దిరాల మండలంలోని 5 గ్రామాలు కలిపి మొత్తం 15 గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. సంబంధిత ఫైళ్లన్నీ సిద్ధం చేసి, అవసరమైన డాక్యుమెంట్లను పూర్తి చేసి తదుపరి చర్యలకు పంపాలని సూచించారు.
ఈ రెండు మండలాల్లో మొత్తం 2960 ఎకరాల వ్యవసాయ భూములకు సుమారు 2021 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయాల్సి ఉంది. రీ-సర్వే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో బౌండరీ సర్వే, ప్రభుత్వ భూముల సర్వేతో పాటు మిగిలిన పట్టా భూముల విస్తీర్ణాన్ని కూడా గ్రామాల వారీగా పూర్తి చేసి, రోజువారీ నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓటర్ల నమోదుపై సమాచారం
ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా జరిగిన ఎన్యుమరేషన్‌లో మొత్తం ఓటర్లు 29,261 మంది ఉండగా, ECI మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు 8,116 మంది ఓటర్ల వివరాలు డిజిటైజ్ చేయడం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో సంబంధిత మండల అధికారులు, రెవెన్యూ, వైద్య, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.




