Suryapet: జనగణనలో తప్పులు దొర్లకుండా చూడాలి: కలెక్టర్ తేజస్ పవార్

Suryapet: జనగణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Oct 2026 7:23 PM IST
Suryapet
X

Suryapet: జనగణనలో తప్పులు దొర్లకుండా చూడాలి: కలెక్టర్ తేజస్ పవార్

సూర్యాపేట: జనగణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో జనగణనపై జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులు, ఛార్జ్ ఆఫీసర్లు (తహసీల్దార్లు), అదనపు ఛార్జ్ ఆఫీసర్లు (ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు)కు రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన రెండో దశ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్, విధివిధానాలు మరియు అధికారుల బాధ్యతల గురించి వివరించారు.

జనగణన రెండో దశను 2027 జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

- స్వీయ గణన (Self Enumeration): 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు

- జనగణన: 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు

- ఇళ్లు లేని వారిని 2027 ఫిబ్రవరి 28 రాత్రి గణించడం జరుగుతుంది

- రివిజనల్ రౌండ్: 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు

జనగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ప్రతి గృహ యజమానిని సంప్రదించి మొత్తం 40 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని, ప్రజలు ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని అందించి జనాభా గణన విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. జనాభా గణన ప్రక్రియను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, సీపీఓ కిషన్, జడ్పీ సీఈవో శిరీష, ఆర్డీవోలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, ట్రైనర్లు ఓబులాల్, జంగయ్య హాజరయ్యారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA