Suryapet: సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యత నాది సర్వోత్తమ్!
Suryapet: కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు.
Suryapet: సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యత నాది సర్వోత్తమ్!
సూర్యాపేట: సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల నూతనంగా నియమితులైన సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మండల అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ధారావత్ వీరన్న నాయక్, ముసుగు రామచంద్రారెడ్డి, తుముల సురేష్ రావు తదితరులు సర్వోత్తమ్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తన కుటుంబం నాలుగు తరాలుగా కాంగ్రెస్‌లో అంకితభావంతో పనిచేస్తుందని పేర్కొన్న సర్వోత్తమ్ రెడ్డి, పార్టీ పటిష్టత కోసం ఎంత దూరమైనా వెళతానన్నారు. "వచ్చే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగురవేసే బాధ్యత నాది" అని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల సీటు కోల్పోయామని, అయితే ఆ తర్వాత జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లు 'తులసివనంలో గంజాయి మొక్క' ఉందని, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో సమర్థవంతమైన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కమిటీని ఏర్పాటు చేశామని, సామాజిక న్యాయ కోణంలో కూడా కమిటీల ఎన్నిక జరిగిందని తెలిపారు.
పదవులు రాలేదని సీనియర్లు బాధపడవద్దని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సార్ ప్రక్రియ ఎన్యుమరేషన్‌ను వచ్చే నెల రోజులు నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాల మేరకు సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




