Miryalaguda: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: మిర్యాలగూడలో కాంగ్రెస్ భారీ నిరసన!

Miryalaguda: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, దిష్టిబొమ్మల దహనం చేపట్టారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 8 Sept 2026 10:22 PM IST
Miryalaguda
X

Miryalaguda: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: మిర్యాలగూడలో కాంగ్రెస్ భారీ నిరసన!

Miryalaguda: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సాగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబెడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్యాంగం పుస్తకం అందించారు తాత మధు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్ను దుర్భాషలాడటం బిఆర్ఎస్ నీచ సంస్కృతికి అద్దం పడుతుందన్నారు అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వికృతంగా ప్రవర్తించారని విమర్శించారు ఎమ్మెల్సీ పదవి నుండి తాతా-మదును బర్తరఫ్ చేసి ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA