Thungathurthi: మందుల సామేల్‌పై నకిరేకల్ కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం
Thungathurthi: దైద రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించి, కోమటిరెడ్డి బ్రదర్స్ పై వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thungathurthi: మందుల సామేల్‌పై నకిరేకల్ కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం
తుంగతుర్తి: నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్ పై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నిన్న తుంగతుర్తి లో జరిగిన ప్రెస్ మీట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరమని అన్నారు.
మందుల సామెల్ ఎమ్మెల్యే తుంగతుర్తి గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ రాత్రి పగలనక కష్టించి పాత కాంగ్రెస్ నాయకులు కొత్త కాంగ్రెస్ నాయకులు అందరిని ఏకం చేసి మందుల సామెల్ భారీ మెజారిటీతో గెలిపించుకోవడం లో చేసిన కష్టం కోమటిరెడ్డి బ్రదర్స్ కి దక్కుతుంది.
అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ని తక్కువ చేసి మాట్లాడటం తక్కువ జాతి తక్కువ జాతీయ అంటూ ప్రెస్మీట్లో చెప్పడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే మందుల సామెల్ మీరు వెంటనే కోమటిరెడ్డి బ్రదర్స్ కి క్షమాపణ చెప్పాలి లేనిచో తుంగతుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏకమై ఏకమవుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్ అన్నారు.




