Suryapet: ఎస్ఐఆర్ సర్వే విజయవంతం 14 మంది బిఎల్‌ఓలకు అభినందనలు!

Suryapet: సూర్యాపేట మండలంలో ఎస్ఐఆర్ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన 14 మంది బిఎల్‌ఓలను కాంగ్రెస్ నాయకులు చీరలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 1 Aug 2026 8:12 AM IST
Suryapet
X

Suryapet: ఎస్ఐఆర్ సర్వే విజయవంతం 14 మంది బిఎల్‌ఓలకు అభినందనలు!

Suryapet: ప్రజాస్వామ్య ప్రక్రియకు పునాది అయిన ఓటర్ల జాబితా సవరణ, సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విజయవంతంగా పూర్తి చేసిన BLOలను గుర్తించి సన్మానించడం గర్వకారణంగా ఉందని సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దండి రమేష్ అన్నారు.

శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట మండలంలోని సోలిపేట, రామచంద్రపురం, రత్నాపురం, రామవరం, ఎండ్లపల్లి, టేకుమట్ల గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ గ్రామాల్లో విధులు నిర్వహించిన 14 మంది BLOలు ఎలాంటి లోపాలు లేకుండా, ఇంటింటి సర్వే నిర్వహించి 100% లక్ష్యాన్ని సాధించినందుకు వారికి చీరలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా దండి రమేష్ మాట్లాడుతూ, "ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమైనా గ్రామ స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో BLOల కృషి ఎంతో ఉంది. సర్ ఎన్యుమరేషన్ వంటి బాధ్యతాయుతమైన పనిని అత్యంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో పూర్తి చేశారు. వారి కృషి వల్లే ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తైంది. కాంగ్రెస్ పార్టీ తరపున వారికి అభినందనలు" అని అన్నారు.

ప్రతి ఓటు విలువైనదని, తప్పు లేని ఓటర్ల జాబితా తయారీలో BLOలు పోషించిన పాత్రను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ అబ్దుల్ రహీం, జిల్లా జనరల్ సెక్రెటరీ వెంకట్ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్, ఉప సర్పంచ్ ఉయ్యాల ఆదినారాయణ, NSUI నాయకులు జలగం రవీందర్, సతీష్ తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సన్మానం అందుకున్న BLOలు తమకు లభించిన గుర్తింపుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందు ముందు కూడా ఇదే బాధ్యతతో పని చేస్తామని హామీ ఇచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story