Tripuraram: త్రిపురారంలో రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా బ్లాక్ డే ర్యాలీ!

Tripuraram: నల్లగొండ జిల్లా త్రిపురారంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై దాడిని నిరసిస్తూ బ్లాక్ డే నిరసన ర్యాలీ.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 8 Oct 2026 1:06 PM IST
Tripuraram
X

Tripuraram: త్రిపురారంలో రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా బ్లాక్ డే ర్యాలీ!

Tripuraram: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతి యుతంగా నిరసన చేపట్టిన లోక్ సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ తో పాటు ఇండియా కూటమి ఎంపీ ల పై డిల్లి పోలీసులు దాడి చేయటాన్ని నిరసిస్తూ TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో బ్లాక్ డే నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న మోడీ, అమిత్ షా లను గద్దె దించేవరకు CEC ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.13 కోట్ల నిరుపేదల ఓట్లను తిరిగి చేర్చాలని SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశ ప్రజల గొంతుకై నిలబడుతున్నారని అందుకే కుట్రతో BJP పోలీసులతో దాడి చేస్తుందని వారు చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించే తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అల్లంపల్లి జానయ్య,బుచ్చి రెడ్డి, మర్ల చంద్ర రెడ్డి,కాసిరెడ్డి నరేష్,వివిధ గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET