Suryapet: యశస్వి ఎంటర్ప్రైజెస్ నూతన దుకాణాన్ని ప్రారంభించిన నేతలు!

Suryapet: సూర్యాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యశస్వి ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్రూఫింగ్ దుకాణాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత ప్రారంభించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Nov 2026 10:32 AM IST
Suryapet
X

Suryapet: యశస్వి ఎంటర్ప్రైజెస్ నూతన దుకాణాన్ని ప్రారంభించిన నేతలు!

Suryapet: సూర్యాపేట పట్టణంలోని పాత వెంకటేశ్వర థియేటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన యశస్వి ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్రూఫింగ్ దుకాణాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, డీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన వారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వినియోగదారుల ఆదరణ పొందుతూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. స్థానికంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, స్థానిక కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు డా. రామ్మూర్తి యాదవ్, గుణగంటి హేమ సతీష్, కొనతం రాజేష్ రెడ్డి, శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం చైర్మన్ పోలేబొయిన నర్సయ్య యాదవ్,

డీసీసీ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల గంగభవాని వీరమల్లు యాదవ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పిల్లల రమేష్ నాయుడు, ఫారూఖ్, పెద్దగట్టు డైరెక్టర్ సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA