Devarakonda: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్లోకి ఉప సర్పంచ్, సభ్యులు!
Devarakonda: దేవరకొండలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. కరువుపై సీఎం రేవంత్‌పై విమర్శలు.
Devarakonda: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్లోకి ఉప సర్పంచ్, సభ్యులు!
Devarakonda: కరువు వస్తోందని తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకుండా, రైతులకు, ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు.
ఆదివారం అంగడిపేట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పీఏ పల్లి మండలం నక్కలపెంట తండా కు చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు.కరువు వస్తోంది.. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయని ప్రజలను భయపెట్టడం కోసమేనా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని ప్రశ్నించారు.
ప్రజలకు భరోసా కల్పించి, వారిని కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమని చెప్పేవాడే నిజమైన పాలకుడని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు.. కానీ వాటిని ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఆరు నెలలుగా ఎల్‌నినో ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ఆరు నెలల్లో కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్న సమయంలో ఎందుకు ఎత్తిపోలేదని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఎందుకు పెంచుకోలేదని ప్రశ్నించారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి తెలంగాణను కరువు బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముందస్తు ప్రణాళికలతో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి, రైతులకు సాగునీరు అందించేవారని పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకునేవారని గుర్తుచేశారు. బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయని, విద్యుత్ సంక్షోభం వస్తుందని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు.
ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు ఎందుకు లేవని, అక్కడ నీటి వనరులు కళకళలాడుతుంటే తెలంగాణలో రిజర్వాయర్లు ఎందుకు వెలవెలబోతున్నాయని ప్రశ్నించారు. కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేమని ముందుగానే చేతులెత్తేయడం పాలనా దక్షత కాదని, రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడమేనని విమర్శించారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి హామీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వాటిని కూడా తన ఘనతగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డి భావదారిద్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రాజకీయ విమర్శలు చేయడం ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. కరోనా సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలను విమర్శించే ముందు, నేడు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అన్నారు.
కరోనా సమయంలో వలస కూలీలను సైతం తెలంగాణ బిడ్డలుగా భావించి కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుందని, ఆ సమయంలో తీసుకున్న చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. అలాంటి చర్యలను కూడా తప్పుగా చిత్రీకరించేందుకు రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో కనీసం పావు వంతైనా రైతులకు, ప్రజలకు నీళ్లు అందించడంపై చూపించాలని హితవు పలికారు. కరువు వస్తుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేని ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుందని ప్రశ్నించారు.కరువు నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏముందని రమావత్ రవీంద్ర కుమార్ ప్రశ్నించారు.
పార్టీలో చేరిన వారు ఉప సర్పంచ్ అంగోతు మునియా వార్డు సభ్యులు కేతావత్ హరియా వార్డు సభ్యులు మేగావత్ కిషన్,కేతావత్ మంగ్తా,ముడావత్ బాలా,మేగావత్ హనుము బావాజీ,మేగావత్ కృష్ణ,కేతావత్ సంతోష్,జాతవత్ రాజా,జాతవత్ నాగేష్,కేతావత్ కుమార్,ఆమ్ గోతు రమేష్,ముడావత్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి,సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి,రైనబోయిన శ్రీను,ఆడెపు నగేష్,రమావత్ కిషన్,అర్వపల్లి నర్సింహ,తోటకూరి పరమేష్,బొడ్డుపల్లి మహేందర్,రమావత్ శ్రీను,రమావత్ దామోదర్,అనిల్,లోకేష్,తదితరులు పాల్గొన్నారు.




