Miryalaguda: మిర్యాలగూడ నిరుపేదల ఇళ్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి
Miryalaguda: ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
Miryalaguda: మిర్యాలగూడ నిరుపేదల ఇళ్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి
మిర్యాలగూడ: ఆర్టీవో కి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మరియు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించుట గురించి మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి ,6వ వార్డ్ కౌన్సిలర్ అడావత్ అశోక్ నాయక్ గార్ల ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది.
ఆనాటి కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇందరమైన నిర్మాణం చేయడం జరిగినది ఇందర మైండ్లకు ఇండ్ల పట్టాలు ప్రస్తుతం నివాసం ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన వారికి వారి ఇండ్లపై ఎటువంటి హక్కు దారులుగా చట్టపరంగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు.
గత కొంతకాలంగా వారికి పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది కావున గ్రీవెన్స్ లో ఆర్డీవో గారికి ఇండ్ల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్ తక్షణ ఇప్పించాలని కోరడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో అంబటి వెంకటకృష్ణ ,నాగు నాయక్, లక్ష్మారెడ్డి, కొట్ట ఆంజనేయులు, కొమ్ముకోటి సైదులు పాల్గొన్నారు.




