Nalgonda: రేపటి క్యాబినెట్ భేటీలో తాగునీటి ఎద్దడిపై చర్చించాలి!
Nalgonda: నల్గొండ మండలంలో ఎండిపోయిన వరి, పత్తి పంట పొలాలను సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు పరిశీలించారు.
Nalgonda: రేపటి క్యాబినెట్ భేటీలో తాగునీటి ఎద్దడిపై చర్చించాలి!
Nalgonda: నల్గొండ మండలంలో ఎండిపోయిన వరి, పత్తి పంట పొలాలను సీపీఎం జాతీయ సభ్యులు బి.వి.రాఘవులు గురువారం పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడులు పెట్టి పంటలు ఎండిపోవడంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
బియ్యం ధరల పెరుగుదల కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉందని విమర్శించారు. పెరిగిన అప్పులతో రైతుల కుటుంబ పోషణ భారమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మంచినీళ్ల కొరతపైనా చర్చించాలని కోరారు.




