Nalgonda: అప్పాజీపేటలో ఎర్రబోతు రామిరెడ్డి స్థూపానికి ఘన నివాళి!
Nalgonda: అప్పాజీపేటలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎర్రబోతు రామిరెడ్డి స్థూపానికి సీపీఎం ఘన నివాళి. 14 ఏళ్లకే ఉద్యమంలోకి దూకిన ధీశాలి అని పాలడుగు నాగార్జున కొనియాడారు.
Nalgonda: అప్పాజీపేటలో ఎర్రబోతు రామిరెడ్డి స్థూపానికి ఘన నివాళి!
నల్లగొండ: నల్లగొండ జిల్లా నిజాం నిరంకుశత్వం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎర్రబోతు రామిరెడ్డి త్యాగాలు నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పేర్కొన్నారు. గురువారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో రామిరెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 14 ఏళ్ల చిన్న వయస్సులోనే సాయుధ పోరాటంలో పాల్గొని ఉరిశిక్ష దాకా వెళ్లిన ధీశాలి రామిరెడ్డి అని కొనియాడారు. అనంతరం అప్పాజీపేట సర్పంచ్‌గా 30 ఏళ్ల పాటు గ్రామాభివృద్ధికి విశేష సేవలు అందించారన్నారు. 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరత్వంతో మలుపు తిరిగిన సాయుధ పోరాటం, భూమి-భుక్తి-విముక్తి కోసం 4 వేల మంది ప్రాణ త్యాగాలతో 10 లక్షల ఎకరాల భూపంపిణీ సాధించిందని గుర్తుచేశారు.




