Suryapet: వర్షంలోనూ ప్రజా భద్రతే లక్ష్యం: సూర్యాపేట పోలీసులు!
Suryapet: మురసు తుఫాను వర్షాలను సైతం లెక్కచేయకుండా సూర్యాపేట పోలీసులు రహదారులపై విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. అత్యవసరమైతే డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
Suryapet: వర్షంలోనూ ప్రజా భద్రతే లక్ష్యం: సూర్యాపేట పోలీసులు!
సూర్యాపేట: మురసు తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీసులు ప్రజాభద్రత విషయంలో వెనకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం, ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.
జిల్లాలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, కూడళ్లు, సరిహద్దు ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, జిల్లాలోకి అక్రమ వస్తువులు, నిషేధిత పదార్థాలు ప్రవేశించకుండా తనిఖీలు ముమ్మరం చేశారు. వర్షాల కారణంగా రహదారులు జారుడుగా మారడం, నీరు నిలవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
వాహనదారులు అతివేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 కు సమాచారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.




