Miryalaguda: దామరచర్ల - రాజాపేట అండర్ పాస్ మంజూరు: ఎంపీ రఘువీర్

Miryalaguda: దామరచర్ల - రాజాపేట మధ్య అండర్ పాస్ మంజూరైనట్లు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సభలో వెల్లడించారు.

Saleem, Nalgonda
Published on: 6 Nov 2026 9:50 PM IST
Miryalaguda
X

Miryalaguda: దామరచర్ల - రాజాపేట అండర్ పాస్ మంజూరు: ఎంపీ రఘువీర్

​మిర్యాలగూడ: ప్రయాణికులు, స్థానికుల సౌకర్యార్థం దామరచర్ల - రాజాపేట మధ్య అండర్ పాస్ నిర్మాణాన్ని మంజూరు చేస్తున్నట్లు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వెల్లడించారు. మిర్యాలగూడలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, త్వరలోనే అండర్ పాస్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda