Kattangoor: మహిళను బైక్‌తో ఢీకొట్టి 3 తులాల గొలుసు అపహరణ!
Kattangoor: కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజ్ వద్ద NH 65పై బైక్‌ను ఢీకొట్టి మహిళ మెడలోని 3 తులాల పుస్తెలతాడును లాకెళ్లారు దొంగలు.
Kattangoor: మహిళను బైక్‌తో ఢీకొట్టి 3 తులాల గొలుసు అపహరణ!
Kattangoor: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజ్ వద్ద జాతీయ రహదారి (NH 65)పై ఘోరం జరిగింది. నకిరేకల్ నుండి ఆటిపాములకు కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న హిమబిందు అనే మహిళను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. ఒకే బైక్‌పై ఎదురుగా వచ్చి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో హిమబిందు, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే దుండగులు కట్టర్‌తో ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును కత్తిరించారు. గాయపడినా హిమబిందు ఎంతో ధైర్యంతో దుండగులను ఎదుర్కొని, ఒకడిని గట్టిగా పట్టుకుంది. దీంతో కంగారుపడిన స్నాచర్లు ఆమె చేతులు విరిచి, కట్టర్‌తో గాయపరిచి నల్గొండ వైపు పారిపోయారు. ఘటనపై కట్టంగూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఎస్సై రవి కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.




