Chityala: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. చిట్యాలలో అంతర్రాష్ట్ర దొంగ జైరాంరెడ్డి అరెస్ట్!

Chityala: చిట్యాలలో పగటిపూట ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అలుగుబెల్లి జైరాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.22.10 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Saleem, Nalgonda
Published on: 2 Sept 2026 11:32 PM IST
Chityala
X

Chityala: తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. చిట్యాలలో అంతర్రాష్ట్ర దొంగ జైరాంరెడ్డి అరెస్ట్!

నల్గొండ: పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అలుగుబెల్లి జైరాంరెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

​నిందితుడి వద్ద నుంచి 12 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, ₹2.50 లక్షల నగదుతో పాటు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు ₹22.10 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story