Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ: సీఎం రేవంత్, నేతల నిరసన!

Revanth Reddy: ఎన్నికల కమిషనర్ బ్రిజేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. సీఎం రేవంత్, విప్ వీరేశం పాల్గొన్నారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 13 Oct 2026 3:49 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ: సీఎం రేవంత్, నేతల నిరసన!

Revanth Reddy: ఎన్నికల కమిషనర్ బ్రిజేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ నుండి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యర్యంలో మంత్రులు ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు కూడా పాల్గొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ జెండాలు, ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA