Devarakonda: ప్రభుత్వాసుపత్రి కార్మికులకు రూ. 26 వేల వేతనం చెల్లించాలి

Devarakonda: దేవరకొండ ఏరియా ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. పదేళ్లుగా పనిచేస్తున్న ఆసుపత్రి కార్మికులకు రూ.26,000 వేతనం చెల్లించాలని డిమాండ్.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 12 Nov 2026 6:07 PM IST
Devarakonda
X

Devarakonda: ప్రభుత్వాసుపత్రి కార్మికులకు రూ. 26 వేల వేతనం చెల్లించాలి

దేవరకొండ: ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కానీ సవేతనం నెలకు 26,000 చెల్లించాలి నూనె రామస్వామి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తేదీ 12 11 2024 మెడికల్ ఎంప్లాయిస్. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేవరకొండ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.

అనంతరం మాట్లాడుతూ కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని మూడు సంవత్సరాలకు ఒకసారి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మిక వేతనాలు పెంచేవారు కానీ ఈసారి నాలుగు సంవత్సరాలు దాటిన అప్పటికి వేతనాలు పెంచలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయినా వారికి కనీసం 16,000 చెల్లించాలని జీవో నెంబర్ ఆరు జారీ చేసింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పైన పేర్కొన్న ఉద్యోగులు గత పది సంవత్సరాల నుండి 20 సంవత్సరాల సర్విస్ ఉన్న ఉద్యోగులు కావున వారి న్యాయమైన పద్ధతిలో నెలకు 26,000 చెల్లించాలని అలాగే చట్టం ప్రకారం సెలవులు అమలు చేయించాలని అలాగే సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్ చెల్లించాలని కాంట్రాక్టర్లు ఇస్తున్న మొత్తం వేతనంపై ఈఎస్ఐ పీఎఫ్ లు కట్ చేస్తూ కార్మికుల ఖాతాలో చాలా తక్కువ సొమ్మును జమ చేస్తున్నారు.

చట్టం ప్రకారం కార్మికుని చెల్లించే పూర్తి వేదనంపై పిఎఫ్ ఈఎస్ఐ మినహాయించగా వచ్చిన సొమ్ముకు అంతే సోము కలిపి వారి ఖాతాలో జమ చేయాలి ఒకవేళ కాంట్రాక్టు పూర్తిగా అమలు చేయని ఎడల చట్టం ప్రకారం యజమాని చెల్లించాల్సి ఉంటుంది అలాగే తేదీ 9. 8.2026 నాడు డి ఎం ఈ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని మరియు శాఖ మంత్రివర్యులు గౌరవ దామోద రాజనర్సింహ గారు గారు పత్రికల ద్వారా ప్రకటించారు కానీ ఒకటి తేదీన చెల్లించడం లేదు కాబట్టి ప్రతి నెల ఒకటవ తేదీన చెల్లించాలని చర్యలు తీసుకోగలరని సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటి యుసి డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జూలూరు వెంకట రాములు మండల కార్యదర్శి అలమొని మల్లయ్య కార్మికులు పొట్ట రామేశ్వరమ్మ శారద తారమ్మ పగిడిమర్రి ప్రణయ్ పద్మ వనజ శ్రీను అంజి లక్ష్మమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA