Devarakonda: దేవరకొండలో నీటి, విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం!

Devarakonda: దేవరకొండ పురపాలక సంఘం పరిధిలో ఎల్‌నినో ప్రభావంపై నీటి, విద్యుత్ పొదుపు అవగాహన కార్యక్రమం. పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 10 Nov 2026 2:05 PM IST
Devarakonda
X

Devarakonda: దేవరకొండలో నీటి, విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం!

Devarakonda: దేవరకొండ పురపాలక సంఘం పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి మరియు విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు 20వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పున్న శైలజ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ నీరు ప్రతి ఒక్కరికీ ఎంతో విలువైన సహజ వనరు అని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని, ప్రతి కుటుంబం నీటి సంరక్షణను తమ బాధ్యతగా భావించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ శ్రీ రామదుర్గారెడ్డి గారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత వంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో నీటి ట్యాంకులు పొంగిపోకుండా చూడాలని, కుళాయిల లీకేజీలను వెంటనే సరిచేయించుకోవాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజలకు నీటి ప్రాముఖ్యత, నీటి వృథా నివారణ, వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాల పెంపు, విద్యుత్ పొదుపు మరియు సహజ వనరుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురిగి శంకర్ గౌడ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రమావత్ సకృ నాయక్, వార్డు అధికారులు ఝాన్సీ, పద్మ, మెప్మా ఆర్‌పీలు, మహిళా సంఘాల సభ్యులు మరియు 20వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA