Devarakonda: దేవరకొండ అయ్యప్ప ఆలయంలో పూజలు: ఎమ్మెల్యే బాలు నాయక్!
Devarakonda: దేవరకొండ శ్రీ అయ్యప్ప ఆలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ పూజలు చేశారు. రూ.12.12 లక్షల విరాళం ఇచ్చిన దాతలను సత్కరించారు.
Devarakonda: దేవరకొండ అయ్యప్ప ఆలయంలో పూజలు: ఎమ్మెల్యే బాలు నాయక్!
దేవరకొండ: పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప మాలధారణ ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అదేవిధంగా, ఆలయంలో అన్నప్రసాద వితరణకు అవసరమైన స్టీల్ టేబుల్స్, స్టీల్ బెంచీలు, అన్నప్రసాదం వడ్డించేందుకు స్టీల్ ట్రాలీలను రూ.12,12,111 విలువతో బహుకరించిన కీర్తిశేషులు గార్లపాటి వాచస్పతి గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు శ్రీ గార్లపాటి ఎల్లయ్య గారు, శ్రీమతి అరుణకుమారి గార్లకు ఎమ్మెల్యే బాలు నాయక్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి సేవలో భాగంగా అన్నప్రసాద వితరణకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, శాలువాతో ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వామి మాలధారణ ప్రారంభ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా, అయ్యప్ప స్వామి భక్తులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, వడ్త్యా దేవేందర్ నాయక్, నక్క వెంకటేష్, శిరందాసు కృష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులు, వాంకునావత్ బిక్కు నాయక్, కొండూరు పవన్ కుమార్, అంగిరేకుల నాగభూషణం, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గడ్డం వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




