Devarakonda: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి బీసీ సంఘం

Devarakonda: దేవరకొండలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల మహాధర్నా, ర్యాలీ. ఆర్‌డీవో పద్మప్రియకు వినతిపత్రం సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు.

Saleem, Nalgonda
Published on: 1 Aug 2026 4:35 AM IST
Devarakonda
X

Devarakonda: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి బీసీ సంఘం

దేవరకొండ: ​ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పిలుపు మేరకు దేవరకొండలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆర్‌డీవో కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టి, ఆర్‌డీవో పి. పద్మప్రియకు వినతిపత్రం సమర్పించారు. బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వంపై విద్యార్థుల పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story