Devarakonda: సెప్టెంబరు 2 నుంచి బీఆర్‌ఎస్ పోరుబాట మాజీ ఎమ్మెల్యే!

Devarakonda: కాంగ్రెస్ వైఫల్యాలపై సెప్టెంబరు 2 నుంచి దేవరకొండలో బీఆర్‌ఎస్ పోరుబాట. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పిలుపు.

Saleem, Nalgonda
Published on: 29 Aug 2026 7:47 PM IST
Devarakonda
X

Devarakonda: సెప్టెంబరు 2 నుంచి బీఆర్‌ఎస్ పోరుబాట మాజీ ఎమ్మెల్యే!

Devarakonda: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎండగట్టేందుకు సెప్టెంబరు 2 నుంచి చేపడుతున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

శనివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన తీరుపై ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story