Devarakonda: దేవరకొండలో దారుణం: 10 రోజులైనా తెలియని మరణం.. జంతువుల పాలైన మృతదేహం!
Devarakonda: నల్లగొండ జిల్లా దేవరకొండలో దారుణం. ఒంటరిగా ఉంటున్న వృద్ధుడు మృతి చెంది 10 రోజులు కావడంతో మృతదేహాన్ని జంతువులు పీక్కుతినాయి.
Devarakonda: దేవరకొండలో దారుణం: 10 రోజులైనా తెలియని మరణం.. జంతువుల పాలైన మృతదేహం!
నల్లగొండ జిల్లా: దేవరకొండ పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు మరణించి పది రోజులు గడిచినా ఎవరికీ తెలియకపోవడం, ఆపై మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతుడు నేరడుగొమ్ముకు చెందిన నాయిని రాజిరెడ్డి (80)గా గుర్తించారు. సుమారు పది రోజుల క్రితమే ఆయన మృతి చెందినట్లు భావిస్తుండగా, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. ఇంట్లోకి ప్రవేశించిన కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కుతినడంతో శరీర భాగాలు వేరైనట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు, ప్రభుత్వ వైద్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజిరెడ్డి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలియాల్సి ఉంది.




