Devarakonda: చికిత్స పొందుతున్న నరేందర్‌ను పరామర్శించిన రవీంద్ర కుమార్!

Devarakonda: హైదరాబాద్ తన్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవరోని తండా వాసి ఇస్లావత్ నరేందర్‌ను దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 30 Oct 2026 1:55 PM IST
Devarakonda
X

Devarakonda: చికిత్స పొందుతున్న నరేందర్‌ను పరామర్శించిన రవీంద్ర కుమార్!

దేవరకొండ: కొండమల్లెపల్లి మండలం దేవరోని తండాకు చెందిన ఇస్లావత్ నరేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని తన్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆసుపత్రికి వెళ్లి నరేందర్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా నరేందర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. నరేందర్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ కొండమల్లెపల్లి మండల అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్ తదితరులు ఉన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA