Devarakonda: మహిళా రైతుల కష్టాలపై కవిత స్పందన

Devarakonda: దేవరకొండ పోలేపల్లిలో వేరుశనగ విత్తనాల కోసం అవస్థలు పడుతున్న మహిళా రైతులపై కల్వకుంట్ల కవిత స్పందన. నల్గొండ కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే విత్తనాలు పంపిణీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Nov 2026 8:03 PM IST
Devarakonda
X

Devarakonda: మహిళా రైతుల కష్టాలపై కవిత స్పందన

దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద శనివారం ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం అవస్థలు పడుతున్న మహిళా రైతుల ఇబ్బందులను చూసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చలించిపోయారు.

డిండి ప్రాజెక్టు పరిశీలన కోసం వెళ్తుండగా పోలేపల్లి రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున మహిళా రైతులు ఉండటం చూసి వారి గురించి ఆరా తీశారు. శనివారం సాయంత్రం డిండి నుంచి తిరిగి వచ్చే వరకు కూడా మహిళా రైతులు అక్కడే ఉండటంతో రైతు వేదికను సందర్శించారు.

వేరు శనగ విత్తనాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మహిళా రైతులు వాపోయారు. వెంటనే నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ తో ఫోన్ లో మాట్లాడారు. గతేడాది 1100 క్వింటాళ్ల వేరు శనగ విత్తనాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది 600 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఇవ్వడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ కు వివరించారు.

స్పందించిన కలెక్టర్ ఉదయం నుంచి ఎదురు చూస్తున్న మహిళా రైతులకు వెంటనే వేరు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని, మిగతా వారి పేర్లు రాసుకొని.. ఇంకా ఎంత మేరకు విత్తనాలు అవసరమో తమకు ఇండెంట్ పంపాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్న మహిళా రైతులకు వేరుశనగ విత్తనాల సంచులను అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్