Deverakonda: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

Deverakonda: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఐ బీసన్న చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సన్మానం.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 5 Oct 2026 5:31 PM IST
Deverakonda
X

Deverakonda: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

దేవరకొండ: దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సం క్షేమ సంఘ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుపబడినది.

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది ఉపాధ్యాయులను సి.ఐ. బీసన్న చేతుల మీదుగా సన్మానం చేసి ప్రశంసా పత్రం, మెమెంటో, శాలువతో సత్కరించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసన్న పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారానే సమాజంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థానానికి ప్రయాణించే, గమ్యం చేరే సూచనలు అందించేటటువంటి వ్యక్తులు గురువులే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను సమాజ హితం కోసం తొలగించే వ్యక్తులు గురువులని వీరికి ప్రపంచంలో అత్యంత స్థానం ఉన్నదని వీరు విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో జీవించడానికి కావలసినటువంటి అంశాలను నేర్పేటువంటి బాధ్యత ఉపాధ్యాయులని అన్నారు.

ఈ కార్యక్రమంలో MKR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవి కుమార్, ఎంఈఓ లు మాతృ నాయక్, నాగేశ్వరరావు నాయక్, రామలింగయ్య , ధన్యరాజు, ఏకుల రాజారావు , గోపియా నాయక్, గరిడి విజయభాస్కర్, చెరుకు నాగరాజుగౌడ్ , అప్ప వీరయ్య, గడ్డం బిక్షమయ్య, రెడ్డి కోటేశ్వరరావు, ఎండి రంజాన్ బేక్, మెరుగు శ్రీనివాస్, ఆడారపు గణేష్, ఎండి అబ్దుల్ కలాం, కొండపల్లి శ్రీను ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA