Suryapet: భూభారతి ఆపరేటర్ల ఆవేదన సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆపరేటర్ల వినతి!

Suryapet: విధుల నుంచి తొలగించిన ధరణి, భూభారతి ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 3 Aug 2026 4:45 PM IST
Suryapet
X

Suryapet: భూభారతి ఆపరేటర్ల ఆవేదన సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆపరేటర్ల వినతి!

సూర్యాపేట: విధుల నుండి తొలగించిన ధరణి, భూభారతి ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆపరేటర్లు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

జిల్లాలోని 23 మండలాలకు చెందిన భూభారతి ఆపరేటర్లు ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. 2018 నుండి రెవిన్యూ శాఖలో ధరణి, భూభారతి పనులతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధుల్లో కీలకంగా పనిచేశామని వారు తెలిపారు. ఓవర్ టైం చేసి కూడా సేవలు అందించామని, గత 15 నెలలుగా జీతాలు రాకపోయినా ప్రశ్నించకుండా నిస్వార్థంగా రెవిన్యూ సేవలు కొనసాగించామని వాపోయారు.

అయినప్పటికీ తమ సేవలను గుర్తించకుండా ప్రభుత్వం ఇటీవల విధుల నుండి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తారని ఆశించామని, కానీ ప్రభుత్వం ఉన్న ఉపాధిని కూడా తొలగించి రోడ్డుపాలు చేస్తుందని ఊహించలేదని ఆందోళన చెందారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని మానవతా కోణంలో పునరాలోచించి, ధరణి, భూభారతి ఆపరేటర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story