Suryapet: ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా పంపిణీ.. వ్యవసాయ శాఖ స్పష్టత
Suryapet: సూర్యాపేట కేసారంలో ఘనంగా విత్తన మేళా. వానాకాలం సీజన్‌లో 7 సన్న వరి రకాలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి.
Suryapet: ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా పంపిణీ.. వ్యవసాయ శాఖ స్పష్టత
సూర్యాపేట: సూర్యాపేట మండలం కేసారంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి రైతులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
వానాకాలం-2026 సీజన్‌లో ఏడు రకాల సన్న వరి రకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటిని సాగు చేసే రైతులకు ప్రత్యేక బోనస్ అందజేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలంలోని రైతు వేదికల్లో విత్తనాల పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, అవసరమైన రైతులు విత్తనాలు తీసుకోవాలని సూచించారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా తీసుకోవాలని, ఒకేసారి దుకాణాలకు రాకుండా క్రమపద్ధతిలో ఎరువులు పొందాలని ఆయన చెప్పారు. దీనివల్ల రద్దీ తగ్గడంతో పాటు సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా ఉంటుందని వివరించారు.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల భూసారం కాపాడబడడంతో పాటు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




