Dorepalli: దోరేపల్లిలో కోదండ రామచంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన
Dorepalli: దోరేపల్లిలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామచంద్రస్వామి ఆలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Dorepalli: దోరేపల్లిలో కోదండ రామచంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన
దోరేపల్లి: మండలంలోని దోరేపల్లిలో నిర్మించిన సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామచంద్రస్వామి ఆలయ విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో సత్ప్రవర్తన అలవడుతుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ దాతలు వినీల, విజయమోహన్ దంపతులను అభినందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.




