Nalgonda: నల్లగొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పత్రాల పంపిణీ!
Nalgonda: నల్లగొండ 18వ డివిజన్‌లో నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ. పత్రాలు అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు.
Nalgonda: నల్లగొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పత్రాల పంపిణీ!
Nalgonda: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌కు చెందిన ఏడుగురు నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ధ్రువీకరణ పత్రాలను నల్లగొండ పీఏసీఎస్ (PACS) చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అందజేశారు.
ఇళ్ల కేటాయింపు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Next Story




