Thungathurthi: తుంగతుర్తిలో ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు!
Thungathurthi: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా తుంగతుర్తిలో వేడుకలు, వెంపటిలో అయ్యప్ప, శివ స్వాములకు స్వేరోలు భిక్ష ఏర్పాటు చేశారు.
Thungathurthi: తుంగతుర్తిలో ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు!
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి: స్వేరో నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వేరో నెట్వర్క్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తుంగతుర్తి మండలంలోని వెంపటి గ్రామంలో అయ్యప్ప, శివ స్వాములకు కొండగడుపుల ఎల్లయ్య కుమార్తెలు సాయి శివాని స్వేరో, సాయి ఆశ్రిత స్వేరో భిక్ష ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్చ నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడుపుల ఎల్లయ్య మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూపిస్తున్న విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, ఆత్మగౌరవ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యపై కల్పిస్తున్న అవగాహన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
స్వేరో నెట్వర్క్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప, శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.




