Kodad: కోదాడ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 5 లక్షల నిధులు

Kodad: ఖానాపురం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ. 5 లక్షలు మంజూరు చేసిన శాసనసభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 11 July 2026 8:05 PM IST
Kodad
X

Kodad: కోదాడ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 5 లక్షల నిధులు

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఖానాపురం గ్రామంలోని వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి శాసనసభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు అండగా నిలిచారు. శనివారం హైదరాబాదులో డిప్యూటీ చైర్మన్ గారిని కలిసిన ఖానాపురం గ్రామ ప్రతినిధులు, ఆలయ విశిష్టతను మరియు ప్రస్తుతం చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆయనకు వివరించారు.

వీరి విన్నపంపై సానుకూలంగా స్పందించిన బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, తక్షణమే 11,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా, ఆలయ సమగ్ర అభివృద్ధికి తన నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన బండ ప్రకాష్ గారికి గ్రామస్తులు మరియు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖానాపురం గ్రామ సర్పంచ్ కంటు లాజర్ ముదిరాజ్, కోదాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ శీలం నాగేంద్రబాబు ముదిరాజ్, డైరెక్టర్లు పిట్టల రాముడు, గుండ్లపల్లి రామారావు, రెడ్డబోయిన ఉపేందర్, అలాగే ప్రముఖులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను, చాపల శ్రీను, గ్రామ కుల పెద్ద గాదె పుల్లయ్య, లింగనబోయిన నాగరాజు, రెడ్డెబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story