Huzurnagar: హుజూర్నగర్‌లో ఘనంగా 69వ కార్మిక విద్యా దినోత్సవం!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లో ఘనంగా 69వ కార్మిక విద్యా దినోత్సవం.. కార్మికులకు ఈ-శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేత.
Huzurnagar: హుజూర్నగర్‌లో ఘనంగా 69వ కార్మిక విద్యా దినోత్సవం!
Huzurnagar: వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక కుటుంబాలకు అండగా ఈ -శ్రమ్ ఇన్సూరెన్స్ నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర రీజనల్ డైరెక్టర్ ఎమ్.ఆర్ దేశ్ పాండే అన్నారు.
బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్లో జాతీయ కార్మిక విద్యా దినోత్సవo సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ- శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్. ఆర్ దేశ్ పాండే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
100 మంది అసంఘటిత కార్మికులకు ఈ - శ్రమ్ కార్డు లు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... నేషనల్ వర్కర్స్ ఎడ్యుకేషన్ డే ను ప్రతి కార్మికుడు పండుగల జరుపుకోవాలని, కార్మికుల హక్కుల చట్టాలను రక్షించుకోవడానికి అవగాహన కల్పించడo కోసం 1958వ సంవత్సరo సెప్టెంబర్ 16 న కార్మిక విద్యా సంస్థ ఇండోర్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ఆ తర్వాత 1959లో హైదరాబాద్ లో ప్రారంభం జరిగిందన్నారు. 50 రీజనల్ డైరెక్టరేట్స్ తో కార్మికులకు వివిధ రంగాలపై శిక్షణ లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి దినం అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటుగా కార్మికులకు వారి హక్కులు, చట్టాలు గురించి కార్మిక విద్యాసంస్థల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. తమ సంస్థ ద్వారా భారత కార్మిక రంగo అభ్యున్నతకై ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు.
1991 లో వచ్చిన నూతన ఆర్థిక విధానాలతో కార్మిక రంగం లో అనేక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వివిధ రంగాలలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ -శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డు చేయించుకోవాలని,ఈ- శ్రమ్ కార్డు ఉంటేనే మిగతా ఇన్సూరెన్స్ లు కూడా అలవోకగా కార్మిక కుటుంబాలకు అందుతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ఎడ్యుకేషన్ ఆఫీసర్ డా. మహేశ్వర్ బాబు,సీనియర్ ఆఫీసర్ లు సంశీర్, అభిలాష్, నరసింహ,సర్పంచ్ రాధా నాగరాజు, కౌన్సిలర్ సుష్మ మురళి,ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంటు చుక్కయ్య,నియోజకవర్గం అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, బ్లాక్ అధ్యక్షులు చిట్యాల అమర్ నాధ్ రెడ్డి, మండల అధ్యక్షులు మేళ్లచెర్వు ముక్కంటి, పట్టణ అధ్యక్షులు మద్దం నాగేందర్, సలికంటి జానయ్య, గుంటుక కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కత్తుల రవీంద్ర, శ్రామిక మిత్రాలు సాయికుమార్, నాగేశ్వరరావు, అజయ్ కుమార్, ఇంటి అచ్చమ్మ, సప్పిడి సావిత్రి, చౌడం శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.




