Suryapet: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ర్యాలీ.. సూర్యాపేటలో స్వాగతం

Suryapet: జాతీయ ఐక్యత, మాదకద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా ఏపీ నుంచి గుజరాత్ వరకు చేపట్టిన ఈగల్ టీం ర్యాలీకి సూర్యాపేట పోలీసులు ఘన స్వాగతం పలికారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Oct 2026 10:23 PM IST
Suryapet
X

Suryapet: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ర్యాలీ.. సూర్యాపేటలో స్వాగతం

సూర్యాపేట: జాతీయ ఐక్యతను చాటుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వరకు చేపట్టిన ఈగల్ టీం ర్యాలీ సూర్యాపేట జిల్లాకు చేరుకుంది.

ఈ బృందానికి సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన, జాతీయ ఐక్యత, సమగ్రతను చాటడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ బృందం గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నది తీరంలో ఈ నెల 31న నిర్వహించనున్న జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననుంది.

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు, పోలీసు యంత్రాంగం, యువత, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA