Thungathurthi: వెంపటి హత్య కేసులో 8 మంది అరెస్ట్.. మరొకరు పరారీలో!

Thungathurthi: తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో జరిగిన చామకూరి మహేష్ హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ మంగళవారం తెలిపారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 24 Nov 2026 7:55 PM IST
Thungathurthi
X

Thungathurthi: వెంపటి హత్య కేసులో 8 మంది అరెస్ట్.. మరొకరు పరారీలో!

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండల కేంద్రంలో DSP ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వెంపటి గ్రామంలో జరిగిన చామకూరి మహేష్ (25) హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో వెంపటి గ్రామ శివారులో చామకూరి మహేష్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు.

సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందాలు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టాయి.కుటుంబ పరువు పోతుందనే కారణంతో హత్యకు కుట్ర పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మృతుడు శ్యామకూరి మహేష్, నిందితుడు రమణబోయిన మహేష్ ఇద్దరూ స్నేహితులు. ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో రమణబోయిన మహేష్ భార్యతో మృతుడు సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన రమణబోయిన మహేష్ వారిని మందలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను మనసులో పెట్టుకుని కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో రమణబోయిన మహేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.ఈ నెల 20వ తేదీన మృతుడు తన ట్రాక్టర్‌పై వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా, ముందస్తు పథకం ప్రకారం నిందితుడు ద్విచక్ర వాహనంపై వెంబడించాడు.

చెరువు సమీపంలో ట్రాక్టర్‌ను అడ్డగించి మృతుడిని కిందకు దించి, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతి, కడుపు భాగాల్లో పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఎనిమిది మంది అరెస్ట్.. ఒకరు పరారీలో

ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24వ తేదీన మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామ సమీపంలో నిందితులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా వెళ్లి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

హత్యకు ఉపయోగించిన కత్తి, వాహనం స్వాధీనంనేరానికి ఉపయోగించిన కత్తితో పాటు నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్లు, నేరానికి సంబంధించి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి దర్యాప్తు నిమిత్తం కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేపడతామని వెల్లడించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: పోలీసుల హెచ్చరిక గ్రామాల్లో చిన్నచిన్న తగాదాలు, మనస్పర్థలు, కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారి సూచించారు. సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. హత్యలు వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy