Nalgonda: ఎల్నినోపై ఆలస్యంగా మేల్కొన్నారా?:
Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎల్నినో తీవ్ర ప్రభావం. సాగు, తాగునీటికి కష్టాలు రాగా ఆలస్యంగా స్పందించిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిపై ప్రతిపక్షాల విమర్శలు.
Nalgonda: ఎల్నినోపై ఆలస్యంగా మేల్కొన్నారా?:
నల్గొండ: ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ, ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగంలో ముందస్తు కార్యచరణ కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎంఆర్‌పీ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం, గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్న సమయంలో జిల్లా స్థాయిలో సమీక్ష ఆలస్యంగా జరిగింది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త సమీక్ష నిర్వహించిన తర్వాతే ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తమయ్యారు. తాగునీరు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపుపై ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష ముందే జరిగి ఉంటే రైతులకు, ప్రజలకు మరింత మేలు జరిగేదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Next Story




