Nalgonda: తాను చదువుకున్న హాస్టల్‌కు ఫ్యాన్లు ఇచ్చిన జీఎం అంజయ్య

Nalgonda: ప్రభుత్వ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులకు ఫ్యాన్లు విరాళంగా ఇచ్చారు విద్యుత్ జీఎం అంజయ్య. తాను చదువుకున్న హాస్టల్‌కు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు

Saleem, Nalgonda
Published on: 27 July 2026 1:33 PM IST
Nalgonda
X

Nalgonda: తాను చదువుకున్న హాస్టల్‌కు ఫ్యాన్లు ఇచ్చిన జీఎం అంజయ్య

పూర్వ విద్యార్థి, విద్యుత్ శాఖ జి.ఎమ్. అంజయ్య దాతృత్వం

​హాస్టల్‌కు ఫ్యాన్ల విరాళం

విద్యుత్ శాఖ జనరల్ మేనేజ‌ర్ (జి.ఎమ్.) శ్రీ అంజయ్య తాను 1989–1991 మధ్యకాలంలో చదువుకున్న ప్రభుత్వ హాస్టల్‌ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి విద్యాభ్యాస పరిస్థితులు, వసతులపై ఆరా తీశారు.

​హాస్టల్‌లో ఫ్యాన్ల కొరత వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వార్డెన్ శ్రీ వీరబాబు దృష్టికి తీసుకెళ్లగా, శ్రీ అంజయ్య తక్షణమే స్పందించి అవసరమైన ఫ్యాన్లను అందజేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story