Nalgonda: గోవా నుంచి నల్లగొండకు అక్రమ మద్యం తరలింపు, 30 బాటిళ్లు స్వాధీనం!
Nalgonda: నల్లగొండకు గోవా నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 30 మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
Nalgonda: గోవా నుంచి నల్లగొండకు అక్రమ మద్యం తరలింపు, 30 బాటిళ్లు స్వాధీనం!
Nalgonda: గోవా నుంచి నల్లగొండకు కారులో మద్యం తరలిస్తున్నారు అనే సమాచారం మేరకు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం బి సి ఐ గణపతి రెడ్డి సిబ్బంది కలిసి చెరువుగట్టు నార్కోటిక్ పల్లి టు నల్లగొండ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నల్లగొండకు చెందినటువంటి ఏతిగోని కృష్ణ కుమార్ (36) అనే వ్యక్తి కారులో మద్యాన్ని నల్లగొండకు తీసుకు వెళుతున్నారు.
నార్కోటిక్ పల్లి టూ నల్గొండ రోడ్డులో కారుని నిలిపి తనిఖీలు నిర్వహించగా కారులో మొత్తం 30 మద్యం బాటిల్లు లభ్యమయ్యాయి. గోవా కి చెందిన ఈ మద్యం బాటిల్లను నిందితుడుని కారును నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ గణపతి రెడ్డి తెలిపారు.




