Nalgonda: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ శరత్ చంద్ర పవార్!
Nalgonda: నల్లగొండ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి శాస్త్రీయ ఆధారాలు సేకరించాలని, 'ఈ-సాక్ష్య' యాప్, సీసీటీఎన్ఎస్ వినియోగించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు.
Nalgonda: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ శరత్ చంద్ర పవార్!
నల్లగొండ: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన, శాస్త్రీయ ఆధారాలు సేకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దర్యాప్తులో 'ఈ-సాక్ష్య' యాప్, సీసీటీఎన్ఎస్ వంటి సాంకేతికతను తప్పనిసరిగా వినియోగించాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును విస్తరించాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు పాల్గొన్నారు.




