Nalgonda: ఫైర్ సిబ్బందిపై వసూళ్ల ఆరోపణలు.. విచారణకు ఆదేశం!
Nalgonda: మేళ్ల దుప్పలపల్లిలో వరికోత యంత్రం దగ్ధమైన ఘటనలో మంటలు ఆర్పినందుకు ఫైర్ సిబ్బంది రూ.7 వేలు వసూలు చేశారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.
Nalgonda: ఫైర్ సిబ్బందిపై వసూళ్ల ఆరోపణలు.. విచారణకు ఆదేశం!
Nalgonda: నల్లగొండ జిల్లా మేళ్ల దుప్పలపల్లిలో వరికోత యంత్రం దగ్ధమైన ఘటనలో అగ్నిమాపక సిబ్బందిపై వసూళ్ల ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిన వేళ, మంటలు ఆర్పినందుకు రూ.7 వేలు వసూలు చేశారని బాధితుడు బండారు శంకర్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.




