Shaligouraram: ఇటుకులపాడులో మూసీ భూముల్లో భారీ ఇసుక తవ్వకాలు..రైతుల ఆందోళన!
Shaligouraram: శాలిగౌరారం మండలం ఇటుకులపాడులో మూసీ ముంపు భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shaligouraram: ఇటుకులపాడులో మూసీ భూముల్లో భారీ ఇసుక తవ్వకాలు..రైతుల ఆందోళన!
Shaligouraram: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపాడు సమీపంలోని మూసీ ముంపు భూముల్లో ఇసుక కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా చేపడుతున్న తవ్వకాలపై స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత యాభై ఏళ్లుగా ఈ భూముల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్న అన్నదాతలు, అకస్మాత్తుగా భారీ యంత్రాలతో గోతులు తీస్తుండటంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఉయ్యాలవాడ సరిహద్దుల్లోనూ జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల రాబోయే వేసవిలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి తాగు, సాగునీటికి తీవ్ర అభావం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
వెంటనే స్పందించి ఈ తవ్వకాలను నిలిపివేయాలని, స్థానిక తహశీల్దార్, ఎంపీడీవోలతో పాటు ఎమ్మెల్యే మందుల సామేలును కలసి విన్నవించేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.




