Nalgonda: నకిరేకల్‌లో రైతులకు ఆత్మ శిక్షణ - అంతర పంటలపై అవగాహన సదస్సు!
Nalgonda: నకిరేకల్ కమల్ గార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆత్మ (ATMA) - అంతర పంటలపై అవగాహన శిక్షణా కార్యక్రమం.
Nalgonda: నకిరేకల్‌లో రైతులకు ఆత్మ శిక్షణ - అంతర పంటలపై అవగాహన సదస్సు!
Nalgonda: నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని కమల్ గార్డెన్ లో వ్యవసాయ శాఖ - నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఆత్మ - ఆర్ పి ఎల్ ఆధారిత శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, నేల సారం పెరుగుతుందని తెలిపారు.
అంతర పంటల సాగులో మెళకువలు, సబ్సిడీతో వచ్చే విత్తనాలు, పరికరాల గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




