Suryapet: సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి!

Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నేర ప్రవృత్తిని వీడి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పిలుపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 2 Oct 2026 10:10 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి!

సూర్యాపేట: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహానుభావులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సత్యం, అహింస, ధర్మం అనే మార్గాలను అనుసరించి దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకతాటిపై నడిపించి దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో గాంధీజీ కీలకపాత్ర పోషించారని, ఆయన చూపిన మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

"జై జవాన్ - జై కిసాన్" నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, అభివృద్ధిలో రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పిన లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజానికి ఇబ్బంది కలిగించే నేర ప్రవృత్తిని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే తత్వాన్ని విడనాడి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మ్‌డ్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్ కుమార్, జానయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, క్లోజ్ టీం ఇన్‌స్పెక్టర్ నవీన్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ట్రాన్స్‌పోర్ట్ ఆర్ఎస్ఐ సురేశ్, ఎస్సైలు సాయిరాం, అన్వర్, అశోక్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ తో పాటు ఆర్మ్‌డ్ సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA