Nalgonda: హామీలు ఏవి మేస్త్రీ నల్లగొండలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

Nalgonda: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నేతృత్వంలో నిరసన.

Saleem, Nalgonda
Published on: 2 Sept 2026 1:20 PM IST
Nalgonda
X

Nalgonda: హామీలు ఏవి మేస్త్రీ నల్లగొండలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

Nalgonda: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన గళం విప్పాయి. నల్లగొండ పట్టణంలోని ప్రసిద్ధ గడియారం సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

​హామీలపై నిలదీత "వెయ్యి రోజులు పూర్తయ్యాయి ఇచ్చిన హామీలు ఎక్కడ మేస్త్రీ?" అంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు.

​మోసపూరిత పాలనపై ధ్వజం: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ప్రజావంచనకే పరిమితమయ్యాయని, రైతులకు బకాయిపడ్డ హామీలు, రుణమాఫీ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story