Munagala: నారు మడులకు ట్యాంకర్లతో నీళ్లు పట్టే దయనీయ స్థితిలో రైతాంగం!

Munagala: ఆకుపాములలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో సమావేశమై, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మరియు ఎల్ నినో కరువుపై నిప్పులు చెరిగారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 25 July 2026 6:13 PM IST
Munagala
X

Munagala: నారు మడులకు ట్యాంకర్లతో నీళ్లు పట్టే దయనీయ స్థితిలో రైతాంగం!

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరువు పరిస్థితులను అరికట్టడంలో, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు నేడు బీడు భూములుగా మారి ఎడారిని తలపిస్తున్నాయని అన్నారు‌. పంట పండించుకోవడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతో కొంత పంటైనా బోర్ల మీద వేసుకుందామంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కరెంట్ లేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండగా, ఇన్వర్టర్లు, జనరేటర్ల కాలం మళ్లీ వచ్చింది.

భూగర్భ జలాలు పడిపోవడంతో రైతన్నలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలినినో వస్తుందని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. వేసిన పంటలకు ఎరువుల కోసం పోతే నకిలీ డీఏపీలు వస్తున్నాయి. యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకోమంటున్నారు కానీ అది ఎట్లానో తెలవక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట దిగుబడి వస్తే తూకం, తాలు పేరుతో బస్తాకు 4 కిలోలు కోత కోసి దోచుకుంటున్నారు.

రైతు భరోసా లేదు, బోనస్ లేదు, సన్న బియ్యం ఇస్తామంటున్న ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతే నేడు కరువయ్యే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం జరగక రైతు కూలీలకు పని దొరకని దుస్థితి నెలకొంది. ప్రాజెక్టులలో నీటిని ఎత్తిపోసి వెంటనే చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story